KCR: కృష్ణకు కేసీఆర్ ఘన నివాళి.. మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చిన సీఎం

KCR pays tribute to Krishna

  • కృష్ణ నివాసానికి వెళ్లిన కేసీఆర్
  • కృష్ణ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించిన సీఎం
  • కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పరామర్శ

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. కాసేపటి క్రితం ఆయన కృష్ణ నివాసానికి వెళ్లారు. కృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మహేశ్ బాబును కేసీఆర్ హత్తుకుని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ తదితర నేతలు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. మరోవైపు, కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News