Inaya: బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఆ ఇద్దరే టార్గెట్!

Bigg Boss 6  Update

  • 71వ రోజులోకి అడుగు పెట్టిన 'బిగ్ బాస్'
  • నిన్న రాత్రి ఆసక్తికరంగా జరిగిన నామినేషన్స్
  • ఇనయా .. రోహిత్ లు ప్రధానమైన టార్గెట్ 
  • రేవంత్ పనితీరు పట్ల రోహిత్ అసహనం 
  • మరింత రసవత్తరంగా జరగనున్న ఈ రోజు గేమ్   

బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం పదిమంది సభ్యులు మాత్రమే ఉన్నారు. విజేతకి 50 లక్షలను అందజేయడం జరుగుతుందని చెప్పడంతో, పోటీదారులు మరింత అప్రమత్తమైనట్టుగా అనిపిస్తోంది. నిన్న సోమవారం రోజున జరిగిన నామినేషన్స్ ప్రక్రియ అందుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఫైమా కెప్టెన్ గా ఉంది గనుక, ఈ వారం ఆమెను నామినేట్ చేయడానికి వీల్లేదు. అందువలన ఇతర పోటీదారుల మధ్య నామినేషన్ ప్రక్రియ జోరుగానే నడిచింది.

ఈ వారం నామినేషన్స్ ను పరిశీలిస్తే ఇంటిలోని ఇతర సభ్యులంతా ఇనయాను .. రోహిత్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిచింది. తనకి సంబంధం లేని విషయాల్లో ఇనయా జోక్యం ఎక్కువైందనే అభిప్రాయాన్ని వాళ్లంతా వ్యక్తం చేశారు. ఒక విషయంలో నుంచి మరో విషయంలోకి వెళ్లి అన్నిటికీ ముడిపెడుతూ రచ్చచేస్తోందని ఆరోపించారు. అందరూ కలిసి తనని టార్గెట్ చేసే అలా వ్యవహరిస్తున్నారంటూ ఆమె తన తీరును సమర్థించుకుంది. 

ఇక 'థర్మాకోల్ బాల్స్' బస్తాల గేమ్ సమయంలో రోహిత్ చాలా కోపాన్ని ప్రదర్శించడం పట్ల ఇంటి సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమయంలో అతని మాటతీరు తప్పుబట్టారు. అతనిలో అంతటి ఆవేశాన్ని తాము చూడలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక రోహిత్ - మెరీనా మాత్రం రేవంత్ పనితీరు బాగా లేదంటూ అతణ్ణి నామినేట్ చేశారు. ఈ రోజు గేమ్ ను, బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే ఎమౌంట్ కి లింక్ పెట్టడం ఆసక్తికరంగా మారనుంది.

Inaya
Rohith
Revanth
Bigg Boss
  • Loading...

More Telugu News