Prakash Raj: నాతో కలసి పనిచేయడానికి చాలా మంది వెనుకాడుతున్నారు: ప్రకాశ్ రాజ్ 

Prakash Raj says lots of people dont work with him now due to his politics They are worried people may not approve

  • అలాంటి వారిని వదిలేసుకోవడానికి తాను సిద్ధమేనని ప్రకటన
  • వీటిపై విచారించడం లేదని స్పష్టీకరణ
  • తనకు ఇప్పుడు మరింత స్వేచ్ఛ లభించిందని కామెంట్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా ఒక విధమైన నిర్వేదంతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్, పలు సందర్భాల్లో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయడం తెలిసిందే. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన క్రమం తప్పకుండా ట్వీట్లు పెడుతుంటారు. 2019లో ఆయన బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలైన విషయం కూడా తెలిసిందే. ఆయన రాజకీయ ఆసక్తులే ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారాయని గ్రహించారు. చిత్ర పరిశ్రమలో ఆయన కెరీర్ పై ఈ రాజకీయ ప్రభావం పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నేను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొందరు నాతో కలసి పనిచేయడం లేదు. నాతో కలసి నటించొద్దని వారికి చెప్పడం వల్ల కాదు. నాతో పనిచేస్తే వారిని యాక్సప్ట్ చేయరేమోనన్న భయం పట్టుకుంది. అలాంటి వారందరినీ కోల్పోవడానికి నేను సిద్ధంగా, ధైర్యంగా ఉన్నాను. నా భయం మరొకరికి శక్తిగా ఉంటుందని నేను ఎప్పుడూ భావిస్తాను. 

నేను వీటి విషయంలో కొంచెం కూడా విచారించడం లేదు. నా నటపైనే దృష్టి పెడుతున్నాను. నేను ఇప్పుడు మరింత స్వేచ్ఛగా భావిస్తున్నాను. ఎందుకంటే, నేను నా స్వరాన్ని వినిపించకపోతే కేవలం మంచి పాత్రలు చేసిన నటుడిగానే చనిపోతాను’’ అంటూ ప్రకాశ్ రాజ్ తన ఆవేదన, అసహనాన్ని హిందుస్థాన్ టైమ్స్ సంస్థతో మాట్లాడిన సందర్భంగా వ్యక్తం చేశారు. చాలా మంది నటులు మౌనంగా ఉంటున్నారంటూ, అందుకు తాను వారిని నిందించాలని అనుకోవడం లేదని.. ఎందుకుంటే మాట్లాడడం వల్ల వచ్చే పరిణామాలను వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు.

More Telugu News