Lic stock: ఇన్వెస్టర్లను మురిపించిన ఎల్ఐసీ.. మొదటి సారి స్టాక్ ర్యాలీ

Lic stock rallied with strong earings

  • ఆరు శాతం లాభంతో రూ.36 పెరిగిన షేరు
  • ఈ ఏడాది మే 17న లిస్ట్ అయిన ఎల్ఐసీ
  • సెప్టెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగిన లాభం
  • దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు మొదటిసారి ర్యాలీ చేస్తోంది. స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన దగ్గర్నుంచీ, ఈ స్టాక్ ధర క్రమంగా క్షీణిస్తూ ఇన్వెస్టర్లకు నికరంగా నష్టాలనే మిగిల్చింది. తాజాగా సెప్టెంబర్ త్రైమాసికానికి ఎల్ఐసీ భారీ లాభాలను ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు ఎల్ఐసీ షేరు కొనుగోలుకు మొగ్గు చూపించారు. దీంతో స్టాక్ గణనీయ లాభాలతో ట్రేడ్ అవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ.36 లాభపడి (6 శాతం పెరుగుదల) రూ.664 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ స్టాక్ ఇటీవల రూ.588 వరకు పడిపోవడం గమనించాలి. 52 వారాల గరిష్ఠ ధర రూ.920గా ఉంది. ఎల్ఐసీ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో పది రెట్లకు పైగా పెరిగి రూ.15,952 కోట్లకు చేరుకోవడం సానుకూల సెంటిమెంట్ కు కారణమైంది. ఈ షేరుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ.917 టార్గెట్ ను ఇచ్చింది. ఎల్ఐసీ ఈ ఏడాది మే 17న స్టాక్ ఎక్సేంజ్ లలో లిస్ట్ అయింది. అప్పుడు నమోదైన రూ.920 ఇప్పటి వరకు అధిగమించకపోవడం గమనించాలి. దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, ఎల్ఐసీ స్టాక్ రూ.700 దాటి పైన నిలదొక్కుకుంటే అప్పుడు ప్రవేశించొచ్చని చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా సూచించారు. స్టాప్ లాస్ కింద రూ.630, 580 పెట్టుకోవచ్చన్నారు. 

  • Loading...

More Telugu News