Srihan: బిగ్ బాస్ హౌస్ ను విడిచిన బ్యూటీ .. ఇక హౌస్ లో ఉన్నది పదిమందే!

- బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి ఇద్దరి ఎలిమినేషన్
- శనివారం రోజున బయటికొచ్చిన బాలాదిత్య
- ఆదివారం రోజున హౌస్ ను విడిచిన వాసంతి
- గ్లామర్ పరంగా ఆమెకి ఎక్కువ మార్కులు దక్కడం విశేషం
- చివరి నిమిషంలో సేఫ్ అయిన మెరీనా
బిగ్ బాస్ హౌస్ లో ఇంతవరకూ ప్రతి సండే ఒకరిని ఎలిమినేటి చేస్తూ వచ్చారు. మొన్న శనివరం .. నిన్న ఆదివారం రోజున హౌస్ నుంచి ఇద్దరు బయటికి వెళ్లనున్నట్టు ముందుగానే నాగార్జున చెప్పడంతో హౌస్ లోని వారందరికీ టెన్షన్ పట్టుకుంది. శనివారం ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నారా అనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. చివరికి బాలాదిత్య బయటికి రావలసి వచ్చింది. ఒక్క సిగరెట్ల విషయంలో తప్ప, తన ప్రవర్తనతో బాలాదిత్య మంచి పేరును సంపాదించుకున్నాడు. కాకపోతే వివరణలతోనే సమయాన్ని చాలావరకూ వృథా చేశాడనే విమర్శలు కూడా ఉన్నాయి.

వాసంతి ఎలా ఆడింది ఆమె విషయాన్ని పక్కన పెడితే, అటు హౌస్ మేట్స్ నుంచి .. ఇటు ఆడియన్స్ నుంచి ఆమె గ్లామర్ కి ఎక్కువ మార్కులు దక్కుతూ వచ్చాయి. తన డ్రెస్సింగ్ సెన్స్ తో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తూ, 'గ్లామర్ ఆఫ్ ద హౌస్' అనిపించుకుంది. నిజానికి వాసంతికంటే కూడా వీక్ కంటెస్టెన్స్ ఉన్నారు. కానీ బిగ్ బాస్ విధి విధానాలను అనుసరించి ఆమె బయటికి రావలసి వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఇకపై బిగ్ బాస్ చూసేవారు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కోల్పోయిన లోటును ఫీలయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. ఇక ప్రస్తుతం హౌస్ లో పదిమంది సభ్యులు ఉన్నారు. విజేతగా నిలిచిన ఒకరికి 50 లక్షల నగదు బహుమతిని అందించనున్నారు.
