Himachal Pradesh: కారులో ఈవీఎంల తరలింపు? టాంపరింగ్ కోసమేనని కాంగ్రెస్ ఆరోపణ

Congress candidate alleges tampering after EVM machines found in private vehicle

  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం
  • ప్రైవేటు కారులో ఈవీఎంలను తరలిస్తుండగా అడ్డగింత
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి
  • సిబ్బందిపై వేటు వేసిన ఎన్నికల సంఘం అధికారులు

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఆరోపించారు. సేఫ్ రూంలో భద్రంగా ఉండాల్సిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లు ప్రైవేటు వాహనాలలో తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కారులో ఈవీఎంలు తరలిస్తున్నారని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. శనివారం అర్ధరాత్రి సిమ్లాలో కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికలలో వినియోగించిన ఈవీఎంలను టాంపరింగ్ చేసేందుకు ఓ కారులో తరలిస్తున్నారని ప్రచారం జరిగింది. 

దీంతో కాంగ్రెస్ పార్టీ రాంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నందలాల్ అలర్టయ్యారు. తన అనుచరులతో కలిసి ఆ కారును వెంబడించారు. అదేసమయంలో ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. నందలాల్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు స్పందించారు. ఆయన ఆరోపణలలో నిజానిజాలను విచారించారు. దీంతో ఈవీఎంలను కారులో తరలిస్తున్న విషయం నిజమేనని తేలింది. దీంతో అనధికారికంగా, ప్రైవేటు కారులో ఈవీఎంలను తరలించడం చట్టవిరుద్ధమని తేల్చి, వాటిని తరలిస్తున్న ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News