Nidhi Agarwal: కళ్లతోనే కట్టిపడేస్తున్న అందాల నిధి లేటెస్ట్ పిక్స్ !

Nidhi Agarwal Special

  • గ్లామరస్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ 
  • యూత్ లో ఈ భామకి విపరీతమైన క్రేజ్ 
  • షూటింగు దశలో ఉన్న 'వీరమల్లు'
  • తమిళంలో సెట్స్ పై ఉన్న మరో సినిమా
  • కుర్రాళ్ల మతి పోగొడుతున్న పిక్స్  

సాధారణంగా హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక సినిమా కోసం వాళ్లు ఎక్కువ రోజుల పాటు పనిచేయవలసి ఉంటుంది. అంతే కాకుండా చాలామంది హీరోలు తమ మాతృభాషలో .. తమకి స్టార్ డమ్ ఉన్న చోటునే సినిమాలు చేస్తుంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు .. ఒక సినిమాలో వారి పాత్ర పరిధి తక్కువగా ఉంటుంది. ఇతర భాషల్లో చేసే అవకాశాలు వారికి ఎక్కువగా ఉంటాయి. అందువలన హీరోయిన్స్ ఏడాదికి నాలుగైదు సినిమాలను చాలా ఈజీగా చక్కబెట్టేస్తూ ఉంటారు. కానీ నిధి అగర్వాల్ విషయం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. టాలీవుడ్ కి ఆమె పరిచయమై ఐదేళ్లు కావొస్తున్నా, అరడజను సినిమాలు కూడా చేయలేకపోయింది. అలాగని చెప్పేసి ఇతర భాషల్లో బిజీగా ఉందా అంటే అదీ లేదు. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ, ఆమె ఆ జోరును కొనసాగించలేకపోయింది. 

నిజానికి నిధి అగర్వాల్ గ్లామర్ కి వంక బెట్టవలసిన పనిలేదు. అత్యంత ఆకర్షణీయమైన హీరోయిన్స్ లో ఆమె ఒకరు. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆమె ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన .. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ పిక్స్ బయటికి వచ్చాయి. రాశి పోసిన అందాల నిధిలా ఆమె ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. కళ్లు తిప్పలేనంత గ్లామర్ తో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ, నటనపై కాస్త దృష్టి పెట్టిందంటే టాప్ హీరోయిన్స్ రేసులో అడుగుపెట్టడం ఖాయంగా అనిపించడం లేదూ!

Nidhi Agarwal
Pavan Kalyan
Udayanidhi Stalin
  • Loading...

More Telugu News