Telangana: ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచిన తెలంగాణ సర్కారు!
- ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు
- ఎస్టీల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన టీఆర్ఎస్ సర్కారు
- అందుకనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరణ
- రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ సర్కారు బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా... తాజాగా దానిని రాష్ట్ర ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. ఫలితంగా తెలంగాణలో భర్తీ అయ్యే ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది.