Telangana: 30 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నా... ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదు: మంత్రి గంగుల
- గంగుల ఇంటిలో ముగిసిన ఐటీ, ఈడీ సోదాలు
- దుబాయి నుంచి కరీంనగర్ చేరిన గంగుల
- దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకే దుబాయి నుంచి వచ్చానని వెల్లడి
గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలంటూ ఆదాయపన్ను, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు పత్రాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.