Kethika Sharma: రెడ్ రోజ్ లా మెరిసిపోతున్న కేతిక .. లేటెస్ట్ పిక్స్!

- పూరి సినిమాతో పరిచయమైన కేతిక
- గ్లామర్ పరంగా యూత్ లో మంచి క్రేజ్
- నటన పరంగాను మంచి మార్కులు
- మరో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్న బ్యూటీ
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. ఢిల్లీలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీని 'రొమాంటిక్' సినిమాతో పూరి జగన్నాథ్ పరిచయం చేశాడు. పూరి సినిమాల్లో కథానాయికలు ఎలా ఉంటారనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన పరిచయం చేసిన ఎంతోమంది కథానాయికలు స్టార్ స్టేటస్ ను చూశారు. అలాగే ఆయన బ్యానర్ నుంచి కేతిక పరిచయమైంది.
మిగతా హీరోయిన్స్ లో కొందరు పూరి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే, పూరి బ్యానర్లో .. ఆయన తనయుడు ఆకాశ్ జోడీగా పరిచయం కావడం కేతిక విషయంలోనే జరిగింది. చూడగానే ముద్దమందారాన్ని గుర్తుచేసేలా ఉండే కేతిక, మొదటి సినిమాతోనే యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది. అందువలన ఆ తరువాత చకచకా 'లక్ష్య' .. ' రంగ రంగ వైభవంగా' సినిమాలు పడ్డాయి.
