Divya Sripada: అటు విజయ్ దేవరకొండ .. ఇటు సమంత.. సంథింగ్ స్పెషల్: దివ్య శ్రీపాద

Divya Sripada Interview

  • ఆకర్షణీయమైన కళ్లతో ఆకట్టుకునే దివ్య శ్రీపాద 
  • మరింత గుర్తింపు తెచ్చిన 'స్వాతిముత్యం'
  • ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అవకాశాలు
  • 'యశోద'లోను దక్కిన కీలకమైన పాత్ర

ఈ మధ్య కాలంలో సెకండ్ హీరోయిన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా దివ్య శ్రీపాద బిజీ అయింది. ఆకర్షణీయమైన కళ్లతో హావభావాలు సహజంగా పలికించడం ఆమె ప్రత్యేకత. అందువలన ఆమెకంటూ అభిమానులు ఉన్నారు. ఆమెను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన 'స్వాతిముత్యం' ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఒక బిడ్డకు తల్లిగా ఆమె పోషించిన పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. 

ఇక ఈ నెల 11వ తేదీన రానున్న 'యశోద' సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ .. సమంత గురించి ప్రస్తావించింది. "నా మెదటి సినిమా 'డియర్ కామ్రేడ్'. ఆ సినిమా కోసమే మొదటిసారిగా నేను కెమెరా ముందుకు వచ్చాను. అందులో నేను చేసిన పాత్ర ఏమిటనేది ఇప్పుడు సినిమా చూసినవారికి తెలుస్తుంది. 

విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయినా సెట్లో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిచింది. ఇక ఇప్పుడు సమంతగారితో కలిసి 'యశోద' చేశాను. ఈ సినిమా కోసం తను చాలా రిస్క్ చేసిందనే చెప్పాలి. ప్రమాదకరమైన ఫైట్లు చేయడానికి కూడా తను వెనకాడలేదు. రియలిస్టిక్ గా ఆమె చేసిన స్టంట్స్ ఈ సినిమాకి హైలైట్. ఇలాంటి స్టార్స్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చింది. 

Divya Sripada
Samantha
Vijay Devarakonda
Yashoda Movie
  • Loading...

More Telugu News