Vaibhav Kandpal: హనీ ట్రాప్ లో చిక్కుకున్న యువ క్రికెటర్

Young cricketer honey trapped

  • జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లిన ఢిల్లీ క్రికెటర్
  • డేటింగ్ సైట్ లో కొందరు వ్యక్తుల పరిచయం
  • అందమైన అమ్మాయిల పేరిట క్రికెటర్ కు ఎర
  • అభ్యంతరకర వీడియోల పేరిట బ్లాక్ మెయిలింగ్

ఢిల్లీ యువ క్రికెటర్ వైభవ్ కందపాల్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లాడు. ఓ డేటింగ్ సైట్ ద్వారా కొందరు వ్యక్తులు వైభవ్ తో పరిచయం పెంచుకుని, అమ్మాయిల పేరిట ఎరవేశారు. 

అతడిని హోటల్ నుంచి బయటికి పిలిచి, ఓ బస్టాండ్ వద్ద అతడికి కొంతమంది అమ్మాయిల ఫొటోలు చూపించారు. ఆపై ఆ క్రికెటర్ వీడియోలను చిత్రీకరించిన ఆ వ్యక్తులు బెదిరింపులకు దిగారు. తమకు డబ్బు ఇవ్వకపోతే వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారు. దాంతో హడలిపోయిన ఆ యువ క్రికెటర్ వారికి రూ.60 వేలు నగదు సమర్పించుకున్నాడు. అంతేకాదు, తన బంగారు నగలు, మొబైల్ ఫోన్ కూడా ఇచ్చేశాడు. 

అయినప్పటికీ వారు బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో వైభవ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిషబ్ చంద్ర, శుభంకర్ బిస్వాస్, శివసింగ్ లను అరెస్ట్ చేశారు. ఈ హనీ ట్రాప్ ముఠాలో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

Vaibhav Kandpal
Honey Trap
Kolkata
New Delhi
  • Loading...

More Telugu News