BJP: దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు... 4 చోట్ల వికసించిన కమలం

BJP wins four assembly constituencies in bypolls
  • నవంబరు 3న ఉప ఎన్నికల పోలింగ్
  • నేడు ఓట్ల లెక్కింపు
  • ఉత్తరాదిన బీజేపీ హవా
  • తెలంగాణలో కాషాయ దళానికి ఓటమి
ఈ నెల 3వ తేదీన దేశంలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అదంపూర్ (హర్యానా), గోలా గోకర్నాథ్ (ఉత్తరప్రదేశ్), గోపాల్ గంజ్ (బీహార్), ధామ్ నగర్ (ఒడిశా) స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. 

అయితే, తెలంగాణలోని మునుగోడులో బీజేపీకి ఓటమి ఎదురైంది. హోరాహోరీ పోరులో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అటు, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో రుతుజా లట్కే గెలిచారు. రుతుజా లట్కే... ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన పార్టీ తరఫున పోటీ చేశారు. 

ఇక బీహార్ లోని మోకమా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిని విజయం వరించింది.
BJP
Bypolls
Counting
India

More Telugu News