TRS: 11వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

TRS leading continues

  • మునుగోడులో కారు జోరు
  • 2, 3వ రౌండ్ మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ
  • 11 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ ఆధిక్యం 5,774 ఓట్లు

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. 11వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 5,774కి పెరిగింది. 11వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యం లభించింది. మునుగోడు కౌంటింగ్ లో 2, 3వ రౌండ్ మినహాయిస్తే ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం లభించింది. 

11వ రౌండ్ అనంతరం టీఆర్ఎస్ కు 74,565 ఓట్లు, బీజేపీకి 68,800 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 16,280 ఓట్లు లభించాయి. ఇంకా, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి మండలాలు లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ మూడు మండలాల్లో భారీగా ఓట్లు లభిస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది.

TRS
Counting
Munugode
Bypolls
  • Loading...

More Telugu News