TDP: ఎన్నారై కమిటీలను నియమించిన టీడీపీ... వివరాలు ఇవిగో!

TDP NRI Committees announced

  • ఎన్నారై కమిటీల వివరాలు ప్రకటించిన టీడీపీ
  • అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో కమిటీలు
  • పలు యూరప్ దేశాల్లోనూ ఎన్నారై కార్యవర్గాలు
  • ఇటీవలే దక్షిణాఫ్రికా, కెనడా కమిటీల ప్రకటన

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో పార్టీ ఎన్నారై కమిటీల నియామకాలు జరిగాయి. ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆమోదముద్ర వేశారు. 

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, కొలంబస్, మాడిసన్, డెట్రాయిట్, మినియాపొలిస్, నషువా, బోస్టన్, ఒమాహా, రిచ్ మండ్, జాక్సన్ విల్లే, షికాగో, ఆస్టిన్, సెయింట్ లూయిస్, బ్లూమింగ్ టన్ ప్రాంతాల్లో ఎన్నారై కమిటీల కొత్త కార్యవర్గాలను నేడు అధికారికంగా ప్రకటించారు. 

అటు... యూకే, లాత్వియా, నార్వే, పోలెండ్, స్వీడన్, బెల్జియం దేశాల్లోనూ టీడీపీ ఎన్నారై కమిటీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లో టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జిలను కూడా నియమించారు. 

ఇటీవలే దక్షిణాఫ్రికా, కెనడా దేశాల్లోనూ టీడీపీ ఎన్నారై కమిటీలను నియమించడం తెలిసిందే. వచ్చే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ బూత్, వార్డు, గ్రామస్థాయి నుంచి విదేశాల్లోని ఎన్నారై సమాజాల వరకు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
 
   


   

 

TDP
NRI
Committes
chan
Atchannaidu
Andhra Pradesh
  • Loading...

More Telugu News