Samantha: ఇగో పక్కన పెట్టేస్తాం .. ఇక్కడ కావలసింది అవుట్ పుట్: 'యశోద' డైరెక్టర్స్
- నాయిక ప్రధానంగా నడిచే 'యశోద'
- టైటిల్ రోల్ ను పోషించిన సమంత
- సరోగసీ విధానం చుట్టూ అల్లుకున్న కథ
- ఐదు భాషల్లో ఈ నెల 11వ తేదీన విడుదల
సమంత ప్రధానమైన పాత్రగా 'యశోద' సినిమా రూపొందింది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, హరి శంకర్ - హరీశ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 11వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
తాజాగా ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకులైన హరి - హరీశ్ మాట్లాడుతూ .. "ఇద్దరం కూడా సినిమాల పట్ల ప్యాషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చాము. ముందుగా తమిళ సినిమాల నుంచి మా ప్రయాణం మొదలైంది. మా అభిప్రాయాలు .. అభిరుచులు .. మేము ఆసక్తిని చూపించే జోనర్లు కలవడం వలన, కలిసి సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాము. అలా మా ప్రయాణం మొదలైంది.
ఇంటర్నేషనల్ న్యూస్ ఐటమ్స్ ద్వారా సరోగసీకి సంబంధించిన ఒక లైన్ అనుకుని, కథను తయారు చేసుకున్నాము. ఫీమేల్ సెంట్రిక్ మూవీ కావడంతో సమంతను కలిసి కథను వినిపించడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. స్క్రిప్ట్ దగ్గర నుంచి సెట్లో అవుట్ పుట్ వరకూ, ఒకరి అభిప్రాయాన్ని ఒకరం గౌరవిస్తూ వెళతాం. ఇగోలు పక్కన పెట్టేసి పనిచేయడమే మా సక్సెస్ కు కారణం. అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నదే 'యశోద' కూడా" అంటూ చెప్పుకొచ్చారు.