Swetha Reddy: ధర్మస్థలకు వెళ్లి క్షమాపణ చెప్పిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి

Makeup  artist Swetha Reddy apology to Dharmasthala Trust

  • పంజుర్లి దేవుడి వేషంలో రీల్స్ చేసిన శ్వేతారెడ్డి
  • శ్వేతారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తుళునాడు ప్రజలు
  • ధర్మస్థల ట్రస్టు అధ్యక్షుడిని కలిసి క్షమాపణ కోరిన వైనం

హైదరాబాద్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు. 'కాంతార' సినిమా తరహాలో పంజుర్లి దేవుడి వేషంలో రీల్స్ చేసిన ఆమెపై కొడగు (తుళునాడు) ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరాహరూపం పాటకు పంజుర్లి దైవంలో మొహానికి రంగులు వేసుకుని, అదే తరహా దుస్తులు ధరించి ఆమె రీల్స్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఈ వీడియోలపై తుళునాడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవాన్ని అవమానించిన మిమ్మల్ని ధర్మస్థల మంజునాథుడే చూసుకుంటాడని వ్యాఖ్యలు చేశారు. దీంతో, శ్వేతారెడ్డి కర్ణాటకలోని ధర్మస్థలకు వెళ్లింది. స్వామికి పూజలు చేసింది. ధర్మస్థల ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డేని కలిసి క్షమాపణలు కోరింది.

  • Loading...

More Telugu News