Twitter: మస్క్ వచ్చాక మరో సమస్య.. ట్విట్టర్ సేవలకు అంతరాయం

Twitter down for some users as Elon Musk asks employees to be ready for mass layoffs

  • వెబ్ వెర్షన్ లో సాంకేతిక సమస్యతో యూజర్ల ఇబ్బంది
  • గుర్తించి సరిచేసిన ట్విట్టర్ 
  • 3700 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో మస్క్‌!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ రోజూ వార్తల్లో నిలుస్తోంది. మస్క్ అనూహ్య నిర్ణయాలు ఆ సంస్థ ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఇప్పుడు ట్విట్టర్ యూజర్లు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

తాజాగా ట్విట్టర్ సర్వర్ డౌన్ అయింది. తమ ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. మొబైల్ యాప్ వాడే వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా.. వెబ్ వినియోగదారులు మాత్రం సమస్యలు ఎదుర్కొన్నారు. వెబ్‌లో మాత్రం సర్వర్ డౌన్ అయింది. ఎర్రర్ మేసేజ్ వచ్చింది. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, 94 శాతం మంది వినియోగదారులు ట్విట్టర్ వెబ్‌తో సమస్యలను నివేదించారు. 6 శాతం మంది మొబైల్ యాప్‌తో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. 

సమస్యను గుర్తించిన వెంటనే ట్విట్టర్ దాన్ని పరిష్కరించింది. అయితే, ట్విట్టర్ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు కూడా ఇలానే అంతరాయం ఏర్పడటంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇక, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ట్విట్టర్‌ సేవలకు అంతరాయం ఏర్పడడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కీలక అధికారులను తొలగించిన మస్క్.. ఇంకో 3700 మంది సిబ్బందిని తొలగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే పనిలో మస్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News