CBI: పెనుకొండలోని టీడీపీ నాయకురాలి ఇంట్లో సీబీఐ సోదాలు

CBI raids in TDP woman leader Savitha
  • టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సోదాలు
  • కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో తనిఖీలు
  • రికార్డులు, లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు
తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఆమె స్వగృహంలో తనిఖీలు కొసాగుతున్నాయి. కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారుల బృందం పెనుకొండకు చేరుకుంది. ఆమె ఇంట్లోని రికార్డులను, ఇతర లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ అధికారుల సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CBI
Telugudesam
Savitha
Penukonda

More Telugu News