P.Vijyababu: ఇంగ్లిష్ చదివిన పిల్లలే తెలుగు సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లు: అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు

Vijayababu Says English is more important than telugu

  • దురదృష్టవశాత్తు తెలుగుకే పరిమితమైపోతున్నామన్న విజయబాబు
  • ఇంగ్లిష్ రావడం వల్లే వివేకానందుడు గొప్పవాడయ్యాడన్న వైనం
  • తమిళులకు రైల్వే ఉద్యోగాలు రావడానికి కూడా ఇంగ్లిషేనన్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు

దురదృష్టవశాత్తు మనం తెలుగుకే పరిమితమైపోతున్నామని, భావి తరాలు ఉభయ భాషా ప్రవీణులుగా తయారు కావాలని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నిన్న సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఇంగ్లిష్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన పిల్లలే తెలుగు భాష, సంస్కృతికి అంబాసిడర్లుగా తయారవుతారని అన్నారు. తెలుగు వారికి కచ్చితంగా ఇంగ్లిష్ రావాల్సిందేనని అన్నారు.

ఆంగ్లం రావడం వల్లే తమిళులు రైల్వేలో ఉద్యోగం సంపాదిస్తున్నారని, బెంగాలీ రచయితలకు ఆంగ్లంపై పట్టు ఉండడం వల్లే సాహిత్యం నుంచి అనువాదాలు వస్తున్నాయని అన్నారు. వివేకానందుడికి ఇంగ్లిష్ రావడం వల్లే అంత గొప్ప వారయ్యారని విజయబాబు అన్నారు. స్వాతంత్ర్య సమరంలో క్విట్ఇండియా అన్న ఇంగ్లిష్ నినాదం వల్లే ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే తెలుగు వింటే చెవులు మూసుకోవాల్సి వస్తోందని విజయబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News