Inaya: 'బిగ్ బాస్ .. నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు' .. ఏడ్చేసిన ఇనయా!

Bigg Boss 6  Update

  • సూర్య విషయంలో ఇనయాపై నిందలు
  • తన తప్పేం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఇనయా 
  • బిగ్ బాస్ మాటలతో దక్కిన ఊరట 
  • బాలాదిత్య సిగరెట్లు దాచిన గీతూ 
  • ఆమెపై మండిపడిన బాలాదిత్య  

బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్య వెళ్లిపోయిన తరువాత, అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సూర్య మంచి ఆటగాడు .. తన మిమిక్రీతో మాంచి ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తూ వచ్చాడు. అతనితో ఇన్నయ్య చాలా చనువుగా ఉండటం వలన కూడా అనేక కామెంట్లు వచ్చాయి. అయితే చివరికి అతను ఇనయా ఎలిమినేట్ చేయడం వలన హౌస్ లో నుంచి బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. ఆమె కారణంగానే సూర్య వెళ్లిపోయాడని హౌస్ లోని వాళ్లంతా ఇనయాను నిందించారు. 

దాంతో ఇనయా వాష్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని .. పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది. ఆమె అలా చేయడంతో మిగతా వాళ్లంతా కంగారుపడిపోయి, ఆమెను బయటికి రప్పించడానికి ప్రయత్నించారు. ఆమెను కన్ ఫెషన్ రూమ్ కి రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు గానీ ఆమె వాష్ రూమ్ లో ఉంచి బయటికి రాలేదు. హౌస్ లోని వాళ్లంతా కూడా సూర్య బయటికి వెళ్లిపోవడానికి తాను కారణమంటున్నారనీ .. అది తాను తట్టుకోలేక పోతున్నాననీ ఇనయా బిగ్ బాస్ తో చెప్పింది. తనని అంతలా నిందిస్తున్న వాళ్ల మధ్యలో .. ఆ ఇంట్లో ఇక తాను ఉండలేనంటూ ఏడ్చేసింది. 

బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎవరూ ఎవరినీ వ్యక్తిగతంగా పంపించలేరనీ .. ఆటతీరును బట్టే అంతా జరుగుతూ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరు వెళ్లిపోయినా అందుకు ఎవరూ కారకులు కాదని అనడంతో అప్పుడు ఇనయా మనసు తేలికపడింది. వాతావరణం చల్లబడిందని అనుకునేలోగానే, మరో టాస్క్ లో బాలాదిత్య -  గీతూ మధ్య మాటల యుద్ధమే జరిగింది. బాలాదిత్య లైటర్ ను .. సిగరెట్లను గీతూ దాచేయడమే అందుకు కారణం. సిగరెట్ తాగకుండా ఎక్కువసేపు ఉండలేని బాలాదిత్య ఆమెపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఆ ఎఫెక్ట్ ఎవరిపై ఎంత పడుతుందనేది చూడాలి.

Inaya
Baladithya
Geethu
Bigg Boss 6
  • Loading...

More Telugu News