నేను ఎప్పుడూ ఎవరినీ హెల్ప్ అడగలేదు: సుమన్
- హీరోగా 100కిపైగా సినిమాలు చేసిన సుమన్
- యాక్షన్ హీరోగాను .. ఫ్యామిలీ హీరోగాను ఇమేజ్
- ఆ విషయంలో ఎంజీఆర్ ఆదర్శమన్న సుమన్
- నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని వెల్లడి
తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నాతో సినిమాలు చేసే నిర్మాతలు బాగుండాలి .. అప్పుడే వాళ్లు నాతో మరిన్ని సినిమాలు తీయగలుగుతారని భావించేవాడిని నేను. అందువలన ఎప్పుడూ కూడా ఏ విషయంలోను నిర్మాతలను ఇబ్బంది పెట్టేవాడిని కాదు. ఈ విషయంలో నాకు ఎంజీఆర్ గారు ఆదర్శం" అన్నారు.
"నేను చాలా ఇబ్బందులను దాటుకుంటూ ఎదిగాను. శోభన్ బాబుగారి కూతురు మృదుల మా అమ్మగారి స్టూడెంట్. ఇక కృష్ణగారి కూతురు కూడా మా అమ్మగారి కాలేజ్ లోనే చదువుకున్నారు. అయినా ఆ పరిచయాలను ఉపయోగించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా హార్డు వర్కును నేను నమ్ముకుంటూ ముందుకు వెళ్లానేగాని ఎప్పుడూ ఎవరి హెల్ప్ తీసుకోలేదు' అంటూ చెప్పుకొచ్చారు.