Realme 10: ఈ నెల 9న విడుదల కానున్న రియల్ మీ 10

Realme 10 with MediaTek Helio G99 chipset to officially launch on November 9

  • ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • రియల్ మీ 10 ధర రూ.20 వేల లోపు 
  • రూ.25 వేల స్థాయిలో 10 ప్రో ప్లస్ ధర
  • కర్వ్ డ్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ

రియల్ మీ 10 సిరీస్ ఫోన్లు ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. రియల్ 10 ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా. అలాగే, రియల్ మీ 10 ప్రో ప్లస్ రూ.25వేల స్థాయిలో ఉండొచ్చని తెలుస్తోంది. విడుదల కార్యక్రమాన్ని యూట్యూబ్ లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. 

ఫోన్లకు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. రియల్ మీ 10 ఐఫోన్ 12 మాదిరిగా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కలిగి ఉంది. రియల్ మీ 10 ప్రో ప్లస్ కర్వ్ డ్ స్క్రీన్ తో రానుంది. రియల్ మీ 10 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ పై పని చేయనుందని తెలుస్తోంది. 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ తో రెండు వేరియంట్లుగా రానుంది. 4,890 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుందని తెలుస్తోంది. 

రియల్ మీ 10 ప్రో ప్లస్ లో మీడియాటెక్ జీ 99 చిప్ సెట్, 120 హెర్జ్ ఎల్సీడీ డిస్ ప్లే, 33 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంటాయని తెలుస్తోంది. ఈ నెల 9న పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

More Telugu News