Team India: సూర్యకుమార్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన టీమిండియా

Team India scores 133 runs against South Africa

  • పెర్త్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు
  • అర్ధసెంచరీతో ఆదుకున్న సూర్యకుమార్ 

దక్షిణాఫ్రికాతో టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ కు సవాలు ఎదురైంది. పెర్త్ మైదానంలో పిచ్ పేసర్లకు విశేషంగా సహకరించింది. సూర్యకుమార్ అర్ధసెంచరీని మినహాయిస్తే, సఫారీ బౌలర్ల దాటికి భారత్ బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేయబట్టి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 12 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (9), దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా (2), దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, వేన్ పార్నెల్ 3, నోక్యా 1 వికెట్ తీశారు.

Team India
South Africa
Perth
Super-12
T20 World Cup
  • Loading...

More Telugu News