Arogya Sree: ఆరోగ్యశ్రీలోకి మరిన్ని జబ్బులను చేర్చిన ఏపీ ప్రభుత్వం

AP govt increases treatments under Arogya Sree

  • మరో 809 చికిత్సలను తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ
  • 3,255కి పెరిగిన చికిత్సల సంఖ్య
  • ఆరోగ్యశ్రీకి బకాయిలు లేకుండా చేస్తున్నామన్న అధికారులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కిందకు మరో 809 చికిత్సలను తీసుకొచ్చింది. దీంతో, ఈ పథకం కింద మొత్తం చికిత్సల సంఖ్య 3,255కి పెరిగింది. ఈరోజు ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజని, వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను పెంచుతున్నట్టు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపారు.  
 
ఆరోగ్యశ్రీకి ఎక్కడా బకాయిలు లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఎంపానెల్డ్ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగాయని చెప్పారు. 104 కాల్ సెంటర్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీ రిఫరల్ సర్వీసులను అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అన్ని సేవల వివరాలను ఎంపానల్డ్, విలేజ్ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే వారికి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించే ఆరోగ్యమిత్రలకు సేవారత్న, సేవామిత్ర, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులను అందజేయనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News