Rachana: ఇప్పటి హీరోల్లో ఆ ఇద్దరంటే ఇష్టం: సీనియర్ హీరోయిన్ రచన

Rachana Interview

  • నిన్నటి తరం కథానాయికగా రచన 
  • వివాహం తరువాత తెలుగు సినిమాలకి దూరం 
  • చరణ్ - బన్నీ అంటే ఇష్టమన్న రచన 
  • తెలుగు రీ ఎంట్రీకి రెడీ అంటూ వెల్లడి  

90వ దశకం చివరిలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయిక రచన. ఆమె పేరు వినగానే 'బావగారూ బాగున్నారా' .. 'కన్యాదానం' .. 'మావిడాకులు' సినిమాలు కళ్లముందు కదలాడతాయి. బిజినెస్ మేన్ ను వివాహం చేసుకున్న ఈ బెంగాలీ బ్యూటీ, 2002 తరువాత తెలుగు తెరపై కనిపించలేదు. 2011 నుంచి మాత్రం ఆమె ఒక టీవీ షో చేస్తూ బిజీగా ఉన్నారు. 

తాజా ఇంటర్వ్యూలో రచన మాట్లాడుతూ .. "బెంగాలీ .. తమిళ .. కన్నడ .. హిందీ సినిమాలను కూడా నేను చేస్తూ వెళ్లాను. ఒక తమిళ సినిమాలో నన్ను చూసిన ఈవీవీగారు, తెలుగులో 'నేను ప్రేమిస్తున్నాను' సినిమాతో ఛాన్స్ ఇచ్చారు. అప్పటినుంచి వరుస తెలుగు సినిమాలు చేస్తూ వెళ్లాను. తెలుగు ఆడియన్స్ నన్ను ఎంతగానో ఆదరించారు. అందుకు వాళ్లకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు. 

" అప్పట్లో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పటి హీరోల విషయానికి వస్తే టాలీవుడ్ లో నాకు రామ్ చరణ్ - అల్లు అర్జున్ అంటే ఇష్టం. అలాగే ఎన్టీఆర్ డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. తెలుగు నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మంచి స్క్రిప్ట్ అనిపిస్తే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Rachana
Ramcharan
Allu Arjun
Junior NTR
  • Loading...

More Telugu News