Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అలీ నియామకం

cine actor ali appointed as advisor to ap government
  • ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ నియామకం
  • రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న సినీ నటుడు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరిగానే అలీకి జీతభత్యాలు లభించనున్నాయి.

2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన అలీ... పలువురు సినీ నటులను వైసీపీకి చేరువ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఆయనకు మంచి పదవే దక్కుతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే అవేవీ కార్యరూపం దాల్చకపోగా...తాజాగా అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది.
Andhra Pradesh
YSRCP
Ali
Tollywood
Advisor

More Telugu News