Karthi: 50 కోట్ల మార్కును టచ్ చేసిన 'సర్దార్' .. ఖాయమైన సీక్వెల్!

Sardar movie update

  • ఈ నెల 21న విడుదలైన 'సర్దార్'
  • ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ 
  • 5 రోజుల్లో 50 కోట్ల వసూళ్లు
  • సీక్వెల్ ను ప్రకటించిన మేకర్స్  

కార్తి హీరోగా 'సర్దార్' సినిమా రూపొందింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 50 కోట్ల మార్కును టచ్ చేసింది. దగ్గరలో పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉంది. 

వాటర్ మాఫియా ఎలా విస్తరిస్తోంది .. భవిష్యత్ తరాలవారు మంచినీళ్ల కోసం ఎంతగా ఇబ్బంది పడతారు అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ చుట్టూ నడిచే ఈ కథలో, ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, కథానాయికలుగా రాశి ఖన్నా - రజీషా విజయన్ కనిపిస్తారు. 

ఈ సినిమాకి సీక్వెల్ ఉండనుందనే విషయాన్ని ప్రకటిస్తూ .. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. మొత్తానికి కార్తి చేతిలో ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్ 2' .. ఖైదీ 2' .. 'సర్దార్ 2' ఉన్నాయన్న మాట. సెకండ్ పార్టులో అయినా కామెడీకి .. రొమాన్స్ కి కాస్త చోటు దొరుకుతుందేమో చూడాలి.

Karthi
Rashi Khanna
Rajeesha Vijayn
Sardar Movie 2
  • Loading...

More Telugu News