Amitabh Bachchan: రక్తస్రావాన్ని ఆపేందుకు డాక్టర్లు కుట్లు వేశారు: అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan injured

  • తాను గాయపడ్డానని వెల్లడించిన అమితాబ్ బచ్చన్
  • ఇనుప ముక్క కాలిని చీల్చిందని వెల్లడి
  • రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారన్న బిగ్ బీ

తనకు పెద్ద గాయమయిందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ఒక ఇనుప ముక్క తన కాలిని చీల్చడంతో తీవ్రంగా రక్తస్రావమయిందని... వెంటనే తనను ఆసుపత్రికి తరలించారని చెప్పారు. రక్తస్రావాన్ని ఆపేందుకు డాక్టర్లు కుట్లు వేశారని తెలిపారు. ఈ మేరకు ఆయన తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు నడవకుండా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తనకు సూచించినప్పటికీ... తాను కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పారు. 

బ్యాండేజ్ తోనే కౌన్ బనేగా కరోడ్ పతి సెట్లో అటు, ఇటు పరుగెడుతున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. మరోవైపు ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ 80వ పడిలో పడ్డారు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో చలాకీగా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

Amitabh Bachchan
Injury
Bollywood
  • Loading...

More Telugu News