Roja: నీ అంత అద్భుతమైన వ్యక్తి ఎవరూ ఉండరు అన్నయ్యా... కొడాలి నానికి బర్త్ డే విషెస్ తెలిపిన రోజా

Roja wishes Kodali Nani on his birthday
  • నేడు కొడాలి నాని పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన రోజా
  • కొడాలి నానిపై పొగడ్తల జల్లు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా, మంత్రి రోజా కూడా కొడాలి నానికి బర్త్ డే విషెస్ తెలిపారు. "హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా" అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. 

"నీ అంత మంచి వ్యక్తులు మరెవ్వరూ ఉండరు బ్రదర్. నువ్వు విలక్షణమైన వ్యక్తివి, అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం" అంటూ కొడాలి నానిని కీర్తించారు. అంతేకాదు, కొడాలి నానితో దిగిన సెల్ఫీని కూడా పంచుకున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమితులవడం తెలిసిందే. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఆయనకు అవకాశం లభించలేదు. ఇక, నగరి ఎమ్మెల్యే రోజా మంత్రి వర్గ విస్తరణలో టూరిజం మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
Roja
Kodali Nani
Birthday
YSRCP

More Telugu News