Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో జనసేన కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి

ysrcp cadre attacks on janasena office in tekkali
  • వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన వైనం
  • పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతల కౌంటర్లు
  • టెక్కలిలోని జనసేన కార్యాలయంపై 30 మంది వైసీపీ కార్యకర్తల దాడి
  • కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైన వైనం
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు వరుసగా పవన్ పై విమర్శలతో దాడికి దిగుతున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై నిరసనలో భాగంగా జనసేన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కార్యకర్తలు దాడికి దిగారు.

శుక్రవారం సాయంత్రం టెక్కలిలోని జనసేన కార్యాలయంపై 30 మంది వైసీపీ కార్యకర్తలు మెరుపు దాడికి దిగారు. తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయని జనసేన కార్యకర్తలు తెలిపారు. ఈ దాడిలో జనసేన కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనతో టెక్కలిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Andhra Pradesh
Janasena
YSRCP
Srikakulam District
Tekkali

More Telugu News