Sameer Sharma: ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం జగన్

AP CS Sameer Sharma hospitalised

  • గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న సమీర్ శర్మ
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
  • కె.విజయానంద్ కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత కారణాలతో అనారోగ్యానికి గురైన ఆయన ఇలీవల ఓ ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. తాజాగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకున్న తర్వాత మళ్లీ విధుల్లో చేరే అవకాశం ఉంది. సమీర్ శర్మను ముఖ్యమంత్రి జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

మరోవైపు సమీర్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్ కు పూర్థి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులను ఇచ్చారు.

Sameer Sharma
Andhra Pradesh
Chief Secretary
Jagan
YSRCP
  • Loading...

More Telugu News