Guntur: ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

 Guntur techie dies while trekking in USs Atlanta

  • ఐదేళ్ల క్రితమే వివాహం
  • ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్‌హిల్స్‌కు వెళ్లిన దంపతులు
  • 200 అడుగుల ఎత్తు నుంచి పడి శ్రీనాథ్ మృతి

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. సాయిచరణి, శ్రీనాథ్ ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఇటీవల అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌‌కు వెళ్లారు. అక్కడ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తు 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

More Telugu News