TDP: ప్యాలెస్ పిల్లి భయపడింది: నారా లోకేశ్

nara lokesh harsh comments on ap cm ys jagan

  • రేపు కడప జిల్లా పర్యటనకు వెళుతున్న నారా లోకేశ్
  • లోకేశ్ పర్యటనకు ఎలాంటి అనుమతి లేదన్న రిమ్స్ పోలీసులు
  • కడప టీడీపీ నేత రాంప్రసాద్ కు నోటీసులు జారీ
  • నోటీసుల కాపీని ప్రస్తావిస్తూ జగన్ పై కామెంట్ చేసిన టీడీపీ అగ్ర నేత

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్య చేశారు. 'ప్యాలెస్ పిల్లి భయపడింది' అంటూ ఆయన ఓ సింగిల్ కామెంట్ తో కూడిన వ్యాఖ్య చేశారు. మంగళవారం నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కడప జిల్లా పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదట. ఈ విషయాన్ని తెలియజేస్తూ కడపకు చెందిన టీడీపీ నేత రాంప్రసాద్ కు రిమ్స్ పోలీసులు ఓ నోటీసును జారీ చేశారు.

అనుమతి లేకుండా కడప జిల్లాకు వస్తున్న నారా లోకేశ్ పర్యటనలో మీరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని సదరు నోటీసుల్లో రాంప్రసాద్ క రిమ్స్ పోలీసులు సూచించారు. తమ సూచనలను పట్టించుకోని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ ను పోలీసులు హెచ్చరించారు. ఈ నోటీసు కాపీని తన పోస్ట్ కు జత చేసిన నారా లోకేశ్ పై కామెంట్ చేశారు.

TDP
Nara Lokesh
Kadapa District
YSRCP
YS Jagan
RIMS Police
AP Police

More Telugu News