Junior NTR: ఎన్టీఆర్ తో కొరటాల కొత్త కథ?

Ntr and koratala movie update

  • ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు 
  • స్క్రిప్ట్ దశలోనే జరుగుతున్న ఆలస్యం 
  • పాత కథను పక్కన పెట్టారంటూ టాక్ 
  • కొత్త కథపైనే జరుగుతున్న కసరత్తు 
  • వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి  

ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాలతో చేయనున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటికి నాలుగైదు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుని ఉండేది. కానీ అటు ఎన్టీఆర్ చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలనం సృష్టించి ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడం, ఇటు 'ఆచార్య'తో కొరటాలకి ఫ్లాప్ పడటం ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైందని అంటున్నారు. 

కొరటాల ముందుగా చెప్పిన కథ తన పాన్ ఇండియా ఇమేజ్ కి సెట్ కాదని ఎన్టీఆర్ భావించాడట. అందువల్లనే కొరటాల కొత్త కథను రెడీ చేస్తున్నాడని అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుందన్న మాట. కొరటాల కొత్త కథ నచ్చితేనే ఎన్టీఆర్ సెట్స్ పైకి వస్తాడనేది బయట వినిపిస్తున్న టాక్. దీనిని బట్టి చూస్తుంటే ఈ ప్రాజెక్టు మరింత లేట్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది.

గతంలో 'జనతా గ్యారేజ్' తో ఎన్టీఆర్ కి కొరటాల హిట్ ఇచ్చినప్పటికీ, అప్పటి పరిస్థితులు వేరు .. ఇప్పటి పరిస్థితులు వేరు. అందువల్లనే ఎన్టీఆర్ సూచనలను బట్టే స్క్రిప్ట్ విషయంలో కొరటాల ముందుకు వెళుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా రష్మిక - కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అనుకోవచ్చు.

Junior NTR
Keerthi Suresh
Koratala Movie
  • Loading...

More Telugu News