Budda Venkanna: చంద్రబాబుపై గుట్కా నాని అవాకులు, చవాకులు పేలుతున్నారు: బుద్ధా వెంకన్న

Budda Venkanna fires on Kodali Nani

  • అప్పుల్లో ఉన్న కొడాలి నాని వేల కోట్లు ఎలా సంపాదించారన్న వెంకన్న
  • ఒకప్పుడు వైఎస్సార్ పునాదులు కదుపుతానని వెళ్లారని వ్యాఖ్య
  • పార్టీ మారితే జగన్ ని కూడా తిడతారన్న వెంకన్న

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్నారని... ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. దోచుకోవడాలు, దాచుకోవడాలు కొడాలి నానికి, సీఎం జగన్ కు అలవాటని అన్నారు. ఒకప్పుడు వైఎస్సార్ పునాదులు కదుపుతానని పలుగు పట్టుకుని వెళ్లిన కొడాలి నాని... ఇప్పుడు ఆయనను ధీరుడు, శూరుడు అంటున్నారని ఎద్దేవా చేశారు. 

తమ అధినేత చంద్రబాబు మీద గుట్కా నాని అవాకులు, చెవాకులు పేలుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని చెప్పారు. రేపు మరొక పార్టీలోకి మారితే... జగన్ ను కూడా నాని తిడతారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నానిని పిచ్చోడిలా చూస్తున్నారని చెప్పారు. తాము చంద్రబాబు మీద అభిమానంతో పని చేస్తున్నామని అన్నారు. కొడాలి నాని, జగన్ లు చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. మతి భ్రమించి మాట్లాడుతున్న నానికి తాము ఏం సమాధానం చెపుతామని అన్నారు. కొడాలి నాని లాంటోళ్లు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయారని చెప్పారు.

Budda Venkanna
Chandrababu
Telugudesam
Kodali Nani
Jagan
YSRCP
  • Loading...

More Telugu News