Elon Musk: తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టిన ఎలాన్ మస్క్

What is the secrete of Elon Musk Fitness health fasting

  • నీ ఆరోగ్య రహస్యం ఏంటి? అంటూ ప్రశ్నించిన మహిళ
  • చూడ్డానికి అద్భుతంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నావంటూ పోస్ట్
  • ‘ఫాస్టింగ్’ అని బదులిచ్చిన మస్క్

సమాజంలో సంపన్నులుగా గుర్తింపు పొందిన వారి వ్యక్తిగత జీవితం పట్ల సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. అంత సంపద ఉంది కదా..? ఏమి తింటారు, ఆరోగ్యం కోసం ఏం చేస్తుంటారు? లైఫ్ స్టయిల్, ధరించే వస్త్రాలు, వాడే గ్యాడ్జెట్లు ఏవి? ఇలాంటి సందేహాలు కొందరికి వస్తుంటాయి. ఎలాన్ మస్క్ తెలుసు కదా. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేతగా, శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించే స్పేస్ఎక్స్ బాస్ గా మస్క్ పరిచయమే. 

ఎలాన్ మస్క్ వయసు 51 ఏళ్లు. అయినా ఎంతో చలాకీగా, యంగ్ గా ఆయన కనిపిస్తుంటారు. దీంతో మస్క్ ఫిట్ నెస్, తేజస్సుపై ఆసక్తి ఏర్పడింది. దీంతో ఎవా మెక్ మిల్లన్ అనే మహిళ ఉండబట్టుకోలేక మస్క్ ను నేరుగా ట్విట్టర్లో అడిగేసింది. ‘‘హే ఎలాన్ మస్క్ నీ ఆరోగ్య రహస్యం ఏంటి? నీవు చూడ్డానికి ఎంతో అద్భుతంగా, ఫిట్ గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. బరువులు ఎత్తుతున్నావు. ఆరోగ్యం కోసం ఏం తింటున్నావు? అని ప్రశ్నించింది. 

దీనికి ఎలాన్ మస్క్ స్పందించారు. సింపుల్ గా ‘ఫాస్టింగ్‘ అని బదులిచ్చాడు. అపార సంపద ఉంది కదా.. ఏది కోరుకుంటే అది తినొచ్చని అనుకుంటే అది పొరపాటేనని మస్క్ సమాధానంతో తెలుస్తోంది. ఎంత ఉన్నా, ఎంత తిన్నా..? చివరికి ఆరోగ్యం కోసం తినకుండా ఉపవాసం చేయడం కూడా తప్పనిసరి అని ఒప్పుకోవాల్సిందే. 

More Telugu News