Sensex: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుని.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex closes with 479 points high

  • 479 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతానికి పైగా పెరిగిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్ విలువ

నిన్న భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. మూడు రోజుల అమ్మకాల ఒత్తిడికి ఈరోజు బ్రేక్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా అప్పులపై వడ్డీ రేట్లు పెరుగుతుండటం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఒక గంట సేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 479 పాయింట్లు లాభపడి 57,626కి చేరుకుంది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 17,123 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.60%), యాక్సిస్ బ్యాంక్ (2.89%), ఎన్టీపీసీ (2.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.33%), ఎల్ అండ్ టీ (1.70%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.25%), భారతి ఎయిర్ టెల్ (-0.60%), టైటాన్ (-0.24%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.22%).

  • Loading...

More Telugu News