Rajanikanth: లైకాతో రెండు భారీ సినిమాలకు రజనీ గ్రీన్ సిగ్నల్!

Rajani Upcoming Movies

  • రజనీ తాజా చిత్రంగా రూపొందుతున్న 'జైలర్'
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • నెక్స్ట్ మూవీ డైరెక్టర్ గా శిబి చక్రవర్తి 
  • లైన్లో దేశింగు పెరియస్వామి

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' సినిమా చేస్తున్నారు. ఇది ఒక జైలు చుట్టూ తిరిగే కథ. 'జైలర్' నుంచి బయటికి వచ్చిన రజనీ లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'నరసింహా' తరువాత రజనీతో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇది. 

ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే రజనీ మరో రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా లైకా బ్యానర్లో నిర్మితం కానుండటం విశేషం. గతంలో ఇదే బ్యానర్ పై రజనీ '2.0' .. 'దర్బార్' సినిమాలను చేశారు. ఈ రెండు సినిమాలు కూడా లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. అందువల్లనే మరో రెండు సినిమాలు చేయడానికి రజనీ ఓకే చెప్పారని అంటున్నారు.

ఒక సినిమాకి 'డాన్'తో హిట్ అందుకున్న శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టుగా చెబుతున్నారు. 'కనులు కనులను దోచాయంటే' డైరెక్టర్ దేశింగు పెరియస్వామి మరో సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ వయసులో కూడా రజనీ కుర్ర హీరోలకు మించిన దూకుడు చూపిస్తుండటం విశేషం.

Rajanikanth
Nelson Dileep Kumar
Sibi Chakravarthi
Desingu Periya Swami
  • Loading...

More Telugu News