Junior NTR: మొత్తానికి ఎన్టీఆర్ ను మెప్పించిన కొరటాల!

Ntr and Koratala movie update

  • ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగు అంటూ టాక్
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • కీలకమైన పాత్రలో విక్రమ్?

'ఆచార్య' సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల, ఆ తరువాత చేయనున్న ఎన్టీఆర్ సినిమా విషయంలో కొంత సమయం తీసుకున్నాడు. 'ఆచార్య' పరాజయంపాలు కావడం వలన .. మరో వైపున 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ రావడం వలన, దానిని నిలబెట్టవలసిన బాధ్యత కొరటాలపై ఉంది. 

అందువల్లనే ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన కథ విషయంలో కొరటాల మరింత కసరత్తు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా తాను ఆశించినట్టుగా స్క్రిప్ట్ వచ్చిందని భావించిన ఎన్టీఆర్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో, సెట్స్ పైకి వెళ్లడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. 

నవంబర్ 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టుగా చెబుతున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తూ ఉండగా, ఒక కీలకమైన పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Junior NTR
Rashmika Mandanna
Koratala Siva
  • Loading...

More Telugu News