Nayanthara: వివాదంలో న‌య‌న‌తార దంప‌తులు... స‌రోగ‌సీపై వివ‌ర‌ణ కోరిన త‌మిళ‌నాడు స‌ర్కారు

tamilnadu government responds on nayanathara surrogacy

  • స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల పిల్ల‌లను క‌న్న న‌య‌నతార దంప‌తులు
  • ఈ వ్య‌వ‌హారంపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ ఆరా
  • స‌రోగ‌సీపై వివ‌రాల‌ను న‌య‌న్ దంపతులు ప్ర‌భుత్వానికి తెలియజేయాల‌న్న త‌మిళ‌నాడు మంత్రి

పండంటి క‌వ‌ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అయిన న‌టి న‌య‌న‌తార, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు వివాదంలో చిక్కుకున్నారు. స‌రోగ‌సీ (అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌నడం) విధానం ద్వారానే న‌య‌న్ దంప‌తులు  క‌వ‌ల పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అయ్యార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో స‌రోగ‌సీని దేశంలో నిషేధించారంటూ సీనియ‌ర్ న‌టి క‌స్తూరి సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ట్వీట్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో న‌య‌న‌తార దంపతుల‌కు క‌లిగిన పిల్ల‌ల వ్య‌వహారంపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్పందించింది. స‌రోగ‌సీపై వివ‌రాల‌ను న‌య‌న్‌, విఘ్నేష్‌లు ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌హ్మ ణియ‌న్ అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే స‌రోగ‌సీ ప్రక్రియ స‌క్ర‌మంగా జ‌రిగిందా? లేదా? అన్న దానిపై న‌య‌న్ దంపతులు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News