Vijay: సంక్రాంతికి 'వారసుడు'రావడం ఖాయమే!

Varasudu Movie Update

  • 'వారసుడు'గా రానున్న విజయ్ 
  • తమిళ టైటిల్ గా 'వరిసు'
  • కథానాయికగా సందడి చేయనున్న రష్మిక 
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల

వంశీ పైడిపల్లి సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడు. స్కిప్ట్ విషయంలో మరొకరిపై ఆధారపడటమే అందుకు కారణమని ఆయన గతంలో చెప్పాడు కూడా.  'ఊపిరి' తరువాత చాలా గ్యాప్ తీసుకుని 'మహర్షి' చేసిన ఆయన, ఆ తరువాత కూడా అంతకు మించిన గ్యాప్ తీసుకుని హీరో విజయ్ తో 'వారసుడు' సినిమా చేస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు. 

తమిళంలో ఈ సినిమాకి 'వరిసు' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అయితే అప్పటికి ఈ సినిమా పూర్తి కావడం కష్టమేననే టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా అదే రోజున థియేటర్లకు రావడం ఖాయమని సమాచారం. 

ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందట. దీపావళికి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ  సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రభు .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Vijay
Rashmika Mandanna
Prakash Raj
Srikanth
Varasudu Movie
  • Loading...

More Telugu News