Chiranjeevi: సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: 'గాడ్ ఫాదర్' డైరెక్టర్

Mohan Raja Interview

  • 'గాడ్ ఫాదర్' గా వచ్చిన చిరంజీవి
  • ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన సల్మాన్ 
  • చిరూ పక్కన కనిపిస్తే చాలన్న సల్మాన్
  • కథ వినకుండా చేయడం గొప్ప విషయమన్న మోహన్ రాజా 

చిరంజీవి - మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన 'గాడ్ ఫాదర్' సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోహన్ రాజా మాట్లాడాడు. 

'ధ్రువ' సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి నేను చరణ్ ను కలుస్తూ ఉండేవాడిని. ముందుగా తనతో 'లూసిఫర్' రీమేక్ చేయమని చిరంజీవిగారు అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కావాలని చిరంజీవి గారిని అడిగినప్పుడు, ఆయన సల్మాన్ గురించి ప్రస్తావించారు. 

'లూసిఫర్' మూవీని ఒకసారి చూడమని సల్మాన్ ఖాన్ కి చెప్పినా ఆయన చూడలేదు. చిరంజీవిగారి పక్కన కనిపిస్తే చాలు అని అనడం ఆయన గొప్పతనం. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నాకు చిరంజీవిగారు చెప్పారు. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్ కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం" అంటూ చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Salman Khan
Nayanatara
God Father Movie
  • Loading...

More Telugu News