Surya: సూర్య సినిమాకి 100 కోట్ల డిజిటల్ డీల్!

Surya in Shiva Movie

  • షూటింగు దశలో సూర్య 42వ సినిమా 
  • కథానాయికగా దిశా పటాని 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • 'అన్నాత్తే' తరువాత శివ చేస్తున్న సినిమా

ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా సూర్య ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలు ఆయన నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వెట్రి మారన్ సినిమాతో పాటు, శివ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా సూర్యకి ఇది 42వ సినిమా. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమా డిజిటల్ డీల్ పూర్తయినట్టుగా చెబుతున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను 100 కోట్లకు సొంతం చేసుకుందనేది చెన్నై టాక్. 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' సినిమాల నుంచి ఓటీటీ సెంటర్ లో సూర్య సినిమాలకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందువల్లనే ఆయన సినిమాల హక్కుల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై గట్టిపోటీనే కనిపిస్తోంది.

యాక్షన్ .. ఎమోషన్ కలగలిసిన కథలను బాగా తెరకెక్కిస్తాడనే పేరు శివకి ఉంది. అజిత్ కి వరుస హిట్లు ఇచ్చిన ఆయన, 'అన్నాత్తే' సినిమాతో రజనీ అభిమానులను మాత్రం నిరాశపరిచాడు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, సూర్య సరసన నాయికగా దిశా పటాని అలరించనుంది.

Surya
Disha patani
Shiva Movie
  • Loading...

More Telugu News