Tollywood: హిందీలో గాడ్ ఫాద‌ర్‌కు మ‌రో 600 స్క్రీన్లు

Another 600 screens added for GodFather in Hindi
  • ద‌స‌రా రోజు విడుద‌లైన చిరు తాజా చిత్రం
  • హిట్ టాక్ తో దూసుకెళ్తున్న మ‌ల్టీస్టార‌ర్
  • రెండు రోజుల్లో 69 కోట్ల వ‌సూళ్లు
ఆచార్య‌తో తీవ్రంగా నిరాశ ప‌రిచిన  మెగాస్టార్ చిరంజీవి తాజాగా 'గాడ్ ఫాదర్'  చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ నెల 5వ తేదీన విడుద‌లైన ఈ సినిమా తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 69 కోట్లు వ‌సూలు చేసింది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది అఫీషియ‌ల్ రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహ‌న్ రాజా మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌య‌న‌తార‌, ప్ర‌తినాయ‌క పాత్ర‌లో స‌త్య‌దేవ్ ఆక‌ట్టుకున్నారు. బాలీవుడ్ బ‌డా హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషించారు.

దీంతో ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేక్ష‌కుల స్పంద‌న నేప‌థ్యంలో హిందీలో గాడ్ ఫాద‌ర్ కి ఒక్కసారిగా 600  స్క్రీన్లు పెంచారు. ఈ విష‌యాన్ని చిరంజీవి వెల్ల‌డించారు. త‌న చిత్రానికి ఇంత మంచి విజ‌యం క‌ట్ట‌బెట్టిన ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్ట‌ర్ లో  షేర్ చేశారు.  

Tollywood
Bollywood
god father
hindi
600 screens
Chiranjeevi
Salman Khan

More Telugu News