Chiranjeevi: సల్మాన్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి.... వీడియో ఇదిగో!

Chiranjeevi thanked Salman Khan

  • అక్టోబరు 5న 'గాడ్ ఫాదర్' రిలీజ్
  • చిరంజీవి తాజా చిత్రానికి సూపర్ హిట్ టాక్
  • మెగాస్టార్ కు విషెస్ తెలిపిన సల్మాన్ ఖాన్
  • స్పందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్ రోల్ పోషించాడు. నిన్ననే సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' సక్సెస్ పట్ల చిరంజీవికి శుభకాంక్షలు తెలిపారు. "మైడియర్ చిరు గారూ ఐలవ్యూ" అంటూ ఓ వీడియో సందేశం పంపారు.

తాజాగా చిరంజీవి కూడా ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. "థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్" అంటూ స్పందించారు.  "మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక 'మసూద్ భాయ్' ఒక శక్తిలా నిలిచాడు" అంటూ చిరంజీవి కొనియాడారు. "థాంక్యూ... లవ్యూ సోమచ్... వందేమాతరమ్" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.

Chiranjeevi
Salman Khan
God Father
Masood Bhai
Tollywood
Bollywood

More Telugu News