Telangana: మునుగోడు అభ్య‌ర్థికి బీఫామ్‌తో పాటు రూ.40 ల‌క్ష‌ల చెక్కును అందించిన కేసీఆర్‌

kcr handed over b form and 40 lack rupees cheque to K Prabhakar Reddy

  • మునుగోడు ఉప బ‌రిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల‌
  • ప్రగ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిసిన ప్ర‌భాక‌ర్ రెడ్డి
  • ఎన్నిక‌ల ఖ‌ర్చుల కోస‌మంటూ ప్ర‌భాక‌ర్ రెడ్డికి రూ.40 ల‌క్ష‌ల చెక్కును ఇచ్చిన కేసీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి శుక్ర‌వారం పార్టీ అధినేత కేసీఆర్ నుంచి డ‌బుల్ బొనాంజా అందింది. ఉప ఎన్నికలో పార్టీ అభ్య‌ర్థిగా త‌న పేరును పార్టీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో శుక్ర‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లిన ప్ర‌భాక‌ర్ రెడ్డి... సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు అవ‌స‌ర‌మైన బీఫామ్‌ను ప్ర‌భాక‌ర్ రెడ్డికి కేసీఆర్ అంద‌జేశారు.

అనంత‌రం ఉప ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుల కోసమంటూ ప్ర‌భాక‌ర్ రెడ్డికి రూ.40 ల‌క్ష‌ల చెక్కును కేసీఆర్ అందించారు. పార్టీ నిధి నుంచే ఈ మొత్తాన్ని ప్ర‌భాక‌ర్ రెడ్డికి కేసీఆర్ అందించిన‌ట్లు టీఆర్ఎస్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా తెలిపింది. ఉప ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థిగా అవకాశమివ్వ‌డంతో పాటుగా ఎన్నిక‌ల ఖ‌ర్చుల కోసం పార్టీ నిధి నుంచి రూ.40 ల‌క్ష‌ల‌ను ఇచ్చిన‌ సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు.

More Telugu News