Jeevitha: మునుగోడు ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న జీవిత

Jeevitha to campaign for BJP in Munugode election

  • నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
  • ప్రచారం చేయాలని కోరుతూ జీవితకు ఈటల ఫోన్
  • ఈటల భార్యతో కలిసి ప్రచారం చేయనున్న జీవిత 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో కూడా గెలిచి సత్తాను చాటాలని బీజేపీ యత్నిస్తోంది. 

ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి జీవితను ఎన్నికల ప్రచారంలోకి బీజేపీ దింపుతోంది. ప్రచారానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రచారం చేయాలని కోరుతూ జీవితకు ఈటల రాజేందర్ ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ భార్యతో కలిసి జీవిత ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News