Uttar Pradesh: రావణుడి దహనంలో.. సీన్ రివర్స్ అయింది

Scene reverse in Ravan dahan programme
  • ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఘటన
  • రావణుడి నుంచి దూసుకొచ్చిన రాకెట్లు
  • పరుగులు పెట్టిన జనాలు
దసరా సందర్భంగా దేశ వ్యాప్తంగా రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో రావణ దహనం కార్యక్రమం సందర్భంగా సీన్ రివర్స్ అయింది. రావణుడి దిష్టి బొమ్మకు నిప్పు అంటించిన సమయంలో ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది. 

రావణాసురుడి నుంచి దూసుకొచ్చిన రాకెట్లు జనాలపైకి ఎగసిపడ్డాయి. దీంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు. భద్రత కోసం అక్కడకు వచ్చిన పోలీసులు సైతం పరుగెత్తారు. ఇదంతా సర్దుకున్న తర్వాత ఓ దున్నపోతు కూడా జనంలోకి దూసుకొచ్చి హంగామా చేసింది.
Uttar Pradesh
Ravan Dahan
Fire Back

More Telugu News