Vijayasai Reddy: మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది: విజయసాయి

Vijayasai reddy fires on media

  • ఏపీలో చర్చనీయాంశంగా దసపల్లా వ్యవహారం
  • ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చకుల మీడియా అంటూ విజయసాయి మండిపాటు
  • దసపల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాస్తోందని ఆగ్రహం

విశాఖలోని దసపల్లా భూముల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వేల కోట్ల విలువ చేసే ఈ భూములను అధికార పార్టీకి చెందిన నేతలు స్వాహా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే విజయసాయిరెడ్డి తన బినామీలకు ఈ భూములను బదిలీ చేస్తున్నారని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై పత్రికల్లో సైతం పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 

'ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చకుల మీడియా. విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజా సేవలో ఉన్న మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది. దసపల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే' అని విజయసాయి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
YSRCP
Dasapalli Lands

More Telugu News